మంగళగిరి కాంగ్రెస్ నేత సలీమ్ అరెస్ట్..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 03:46 PM
 

మూడు రాజధానులు బిల్లును వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిగృహ ముట్టడికి వెళ్తున్న.. కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజక వర్గ కన్వీనర్ షేక్ సలీమ్ ను సోమవారం తాడేపల్లి పోలీస్ లు అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తరలించారు. రాజధాని ప్రాంతంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.