ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 02:01 PM
 

ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..“రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. తమ విధుల నిర్వహణలో ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా. గతంలో లాగే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు.