బెజవాడ యువతికి అరుదైన గౌరవం..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 12:53 PM
 

విజయవాడకు చెందిన నాగదుర్గా కుసుమసాయికి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. తానా,ఇతర తెలుగు సంస్థలు కలిపి నిర్వహించిన ఆన్ లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ లో కుసుమసాయికి ఈ కిరీటం దక్కింది. 600 మందికి పైగా పోటీలో పాల్గొనగా కుసుమసాయికి ఈ అరుదైన గౌరవం దక్కింది. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని నిర్వాహకులు తెలిపారు.