ఏపీలోకి ఎంటరయిన నిమ్మగడ్డ..నేడు బాధ్యతల స్వీకరణ

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 11:37 AM
 

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ కొద్దిరోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఉద్వాసనకు గురైన ఆయన అనేక కేసులు కోర్టులు తరువాత మళ్లీ అదే స్థానాన్ని అందుకున్నారు. ఇక ఈరోజు ఆయన మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆయన తన పాత స్థానాన్ని ఆక్రమించనున్నారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు.