కడప జిల్లాలో శానిటైజర్‌ తాగి ముగ్గురి మృతి..

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 03, 2020, 10:54 AM
 

కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్‌ తాగి ముగ్గురు మృతి చెందారు. నిన్న శానిటైజర్‌ తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం ఇంటి వద్ద మరొకరు చనిపోయారు.
మృతులను చెన్నకేశవులు, భీమయ్య, ఓబులేష్‌లుగా గుర్తించారు. అంతేకాదు ఈ ప్రాంతంలో వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్‌ తాగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.. మద్యం ధరలు భరించలేక మందుబాబులు ఇలా శానిటైజర్‌ తాగుతున్నారని మృతుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల క్రితమే ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి 16మంది చనిపోయిన చేరిన సంగతి తెలిసిందే.