ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన ఆకు ఇదే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 31, 2020, 04:51 PM

టెన్షన్, ఆఫీస్ ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు వంటి వాటన్నింటి ప్రభావం ముందుగా మన చర్మం, జుట్టుపైనే పడుతుంది. అనేక కారణాలతో జుట్టు ఊడుతుంటుంది. ఒక్కసారి సమస్య ప్రారంభం అయిందంటే తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు జట్టు విపరీతంగా ఊడిపోకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.పొడవైన, బలమైన జుట్టు అంటే అందరికీ ఇష్టమే. దీని కోసం రకరకాల షాంపూలు, నూనెల వాడుతుంటారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. గుంటగలగర ఆకు ఎక్కువ పొలాల్లో దగ్గర్లో ఉంటుంది. సిటీల్లో ఉండేవారు తెలిసిన వారితో తెప్పించుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి పెరుగుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే.. ముందుగా గుంటగలగర ఆకుని తీసుకోవాలి. ఇది మీకు ఇష్టమైన పరిమాణంలో తీసుకోవచ్చు. కొలత ఏం అవసరం లేదు.. కావాలంటే.. ఓ పెద్ద బౌల్ నిండా ఆకుని తీసుకోవాలి. దీనిని నీటితో బాగా శుభ్రంగా కడుక్కోవాలి.. కాస్తా నీరు పోయేవరకూ ఉంచి దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. తయారైన పేస్ట్‌ని మీకు ఎంత నూనె కావాలో ఆ పరిమాణంలో తీసుకుని అందులో ఈ పేస్ట్‌ని వేసి ఓ 10 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత నూనె కూడా పచ్చగా రంగు మారుతుంటుంది. దీనిని గోరువెచ్చగా అయిన తర్వాత ఓ సీసాలో బాగా పెట్టుకోవాలి. ఈ నూనెని వారానికి రెండు నుంచి మూడుసార్లు రాసి మసాజ్ చేస్తుండాలి. తర్వాతి రోజు తలస్నానం చేసినా పర్లేదు.. ఇలా రెగ్యులర్‌గా 2 నుంచి 3 నెలల పాటు రాయండి. రెగ్యులర్‌గా చేస్తుంటే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు, ఊడిన జుట్టు స్థానంలో మరింత ఒత్తుగా జుట్టు వస్తుంటుంది. గుంటగలగర ఆకులోని ఎన్నో అద్భుత గుణాలే ఇలా జుట్టుని తిరిగి మొలిపించడానికి కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా చేయండి. జుట్టు సమస్యలను దూరం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com