ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ 3 బ్యాంకులు బెస్ట్.. మీ డబ్బుకు అదిరిపోయే లాభం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 09:04 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ లభిస్తోంది. వీటిల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బ్యాంకులో ఎఫ్‌డీలపై 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. 7 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం, 45 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సన్‌రైజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇక ఆటుపైన ఎఫ్‌డీలపై 9 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేటు లభిస్తుంది. ఇక నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com