కంటైన్మెంట్ జోన్ గా తిరుమల

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:46 PM
 

తిరుమలను అధికారులు కంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. తిరుమలలో ఇప్పటి వరకు దాదాపు 84 మందికి కరోనా సోకింది. కేసులు పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తిరుమలను కంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. అదే విధంగా ఏపీఎస్పీ బెటాలియన్ లో 50 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో దర్శనాలకు అనుమతిస్తారా లేదా అనే దాని పై సందిగ్దత నెలకొంది. ఇప్పటికే భక్తులు జూలై 31 వరకు దర్శనాలకు టికెట్లు బుక్ చేసుకున్నారు.