ప్రియురాలికి యువకుడు వేధింపులు

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:45 PM
 

ఓ యువకుడు యువతిని ప్రేమించాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని పోర్న్ వెబ్ సైట్లలో పెడుతానని బెదిరించాడు. కొంత నగదు తీసుకున్నాడు. అయినా అతని వేధింపులు ఆగకపోవడంతో యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ యువకుడు బీటెక్ అమ్మాయిని ప్రేమించాడు. అలా ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు,వీడియోలను ఆమెకు తెలియకుండా తీశాడు. వాటిని ఆ యువతికి చూయించి బెదిరించాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పోర్న్ సైట్లలో వీడియోలు పెడుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయపడ్డ యువతి రూ.2లక్షల వరకు నగదు,రెండు బంగారు గాజులు ఇచ్చింది. అయినా అతని వేధింపులు ఆగలేదు. తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఈ విషయం ఇద్దరు కానిస్టేబుల్స్ కు తెలిసినా వారు యువకునికే మద్దతు పలికారు. దీంతో ఆ యువతి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే యువకునికి సహకరించిన ఇపూరు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అప్పల్ నాయుడు, నరసరావుపేట టూటౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనుబాబుతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల గుంటూరులో ఓ యువతి నగ్న చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటి వరకు 10 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇంతలోనే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.