ఆ 89 యాప్స్ తొలగించాలని సైనికులకు ఆదేశం...!

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:43 PM
 

చైనాకు చెందిన టిక్‌టాక్, హలో సహా మొత్తం 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్మీలో పని చేస్తున్న సైనికులు తమ ఫోన్లలో జులై 15వ తేదీలోగా 89 యాప్స్‌లో ఉన్న తమ అకౌంట్స్‌ను తొలగించాలని ఆర్మీ ఆదేశించినట్టు ఇండియా టీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసినట్టు ఆ కథనంలో పేర్కొంది. యాప్స్ జాబితాలో చైనాకు చెందిన యాప్స్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, డైలీ హంట్, న్యూస్ డాగ్, టిక్ టాక్, షేర్ ఇట్, ట్రూ కాల్, పబ్‌జి, టిండర్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్ సైబర్ వార్‌కు దిగే అవకాశాలు ఉండటంతో ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంటునట్టు తెలుస్తోంది.