యూఐడీఏఐ తాజాగా తీపికబురు అందించింది. ఆధార్ లో అడ్రస్ మార్చుకోవడానికి కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు ఇప్పుడు సులభంగా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. దీని కోసం మీ వద్ద రెంట్ అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది. అయితే రెంట్ అగ్రిమెంట్లో కచ్చితంగా మీ పేరు మాత్రం ఉండాల్సిందే. లేదంటే ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం కుదరదు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా రెంటల్ అగ్రిమెంట్‌ను స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీ ఆధార్ కార్డులో అడ్రస్ మారుతుంది. దీని కోసం ముందుగా మీరు యూఐడీఏఐ పోర్టల్ ఓపెన్ చేయాలి. తర్వాత అడ్రస్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత రెంట్ అగ్రిమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఇందులోని వివరాలతో స్టేటస్ తెలుసుకోవచ్చు. కాగా ఆధార్‌లో వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లో ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం మీరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.