వారి సేవలకు సలాం కొట్టిన మోదీ

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:32 PM
 

ఈ కరోనా సమయంలో సేవలందిస్తున్న ఎన్జీవోలను ప్రధాని మోదీ కొనియాడారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఎన్జీవోలు తమ సేవలను కొనసాగించడం చిన్న విషయం కాదన్నారు. కరోనా పేరు వింటనే భయపడే పరిస్థితుల్లోనూ ప్రాణాలు లెక్కచేయకుండా సేవ చేశారని అభినందించారు. మీ సేవలకు సలాం అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తను ప్రాతినధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని ఎన్టీవో సంస్థల ప్రతినిధులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యూపీ జనాభాతో సమానంగా ఉన్న బ్రెజిల్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా 65వేల మంది మరణించారన్నారు. కానీ యూపీలో 800 మంది మాత్రమే చనిపోయారన్నారు. మన దేశంలో మనం కరోనాను ఏ విధంగా కట్టడి చేస్తున్నామో ఈ లెక్కలు చెబుతున్నాయన్నారు. అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోగలిగామన్నారు.