విటమిన్ D ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు ఇవే...

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 09, 2020, 03:30 PM
 

విటమిన్స్ శరీరానికి రక్షణ కవచాలు. అవి లోపించినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒక్కొక్క విటమిన్ శరీరంలో ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ D లోపం వలన చిన్న పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్దవారిలో ఎముకలు మెత్తబడిపోతాయి. ఈ విటమిన్ కావాల్సిన స్థాయిలో లేకపోతే మగవారిలో కొలొరెక్టల్ క్యాన్సర్, ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.


విటమిన్ D ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువ లభిస్తుందో తెలుసుకుందాం...


1. పాలు, పాల పదార్ధాలు


పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్...అన్నింటిలోనూ విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటూ ఎగ్స్ కూడా చాలా మంచివి. అయితే ఎగ్స్‌ని యోక్ తో సహా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ D ఉండేది ఎగ్ యోక్‌లోనే.


2. ఫిష్


సాల్మన్, ట్యూన్న ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ D ఉంటుంది. దాంతో పాటూ వీటిలో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇవి తీసుకుంటే మీ డైట్ న్యూట్రియెంట్ రిచ్ గా తయారౌతుంది.


3. మష్రూమ్స్


మష్రూమ్స్‌లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ D కూడా ఎక్కువే. వీటిని పీజా, పాస్తా, ఫ్రైడ్ రైస్, సాండ్విచ్, ఆమ్లెట్, స్టర్-ఫ్రైడ్ వెజ్జీస్ లాంటి రకరకాల వంటల్లో వాడుకోవచ్చు.


4. హోల్ గ్రెయిన్స్


గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ D ఎక్కువ మోతాదులో లభిస్తుంది. అయితే వీటిని ప్రాసెస్ చెయ్యకుండా తీసుకోవాలి.