ప్రియుడితో భార్య..భర్త ఏం చేశాడంటే

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:48 PM
 

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఉండగా చూసిన భర్త ఆవేశంలో ప్రియుని పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇండియానాకు చెందిన రాబర్ట్ బెక్,జోడి బెక్ దంపతులు. వీరికి ఇటీవల మనస్పర్దలు రావడంతో జూలై 2న విడిపోయారు. ఆ తర్వాత రాబర్ట్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కేవలం గంటల వ్యవధిలో తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జోడిబెక్ ఇంట్లో తన ప్రియుడు ఎక్లేస్ తో కలిసి ఉంది. దీనిని చూసి షాకైన రాబర్ట్ కోపంతో ఎక్లేస్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తాను ఓ వ్యక్తిని షూట్ చేశానని రాబర్ట్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ ఎక్లెస్ ను ఆస్పత్రికి తరలించారు. ఎక్లేస్ కు ఎడమ చేతితో పాటు ఎడమవైపు ఛాతీ భాగంలో బుల్లెట్ దిగాయి. రాబర్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.