వైఎస్సార్ కు ఘన నివాళి

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:44 PM
 

నేడు మాజీ సీఎం,దివంగత నేత వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు,సీఎం జగన్ ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఇడుపాలపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ భార్య విజయమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.