రాశి ఫలితాలు(08-07-2020)

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:42 PM
 

రాశి-మేషం


బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువలు అవసరం. ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు తప్పవు. బంధువర్గంతో విరోధాలు. నిర్ణయాల్లో పొరపాట్లు దొర్లుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి అంచనాలు తారుమారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.


రాశి-వృషభం


విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ఉత్సాహంగా పనులు చేపడతారు. ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగిమిస్తారు.


రాశి-మిధునం


వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. పనులు సకాలంలో చక్కదిద్దుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు చొరవ తీసుకుని పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగ సూచనలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఆస్తిలాభం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.


రాశి-కర్కాటకం


వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. మానసిక అశాంతి తప్పదు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. అధిక పనిభారం.


రాశి-సింహం


ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధు మిత్రులతో విరోధాలు. కొన్ని విషయాలలో అంచనాలు తప్పుతాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయాల సందర్శనం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమస్యలు.


రాశి-కన్య


ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రావాల్సిన బాకీలు అందుతాయి. పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితుల ప్రశంసలు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి చికాకులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.


రాశి-తుల


సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయానికి మించి ఖర్చులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు. దైవ దర్శనాలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.


రాశి-వృశ్చికం


వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పాత మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారవచ్చు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. గృహ, వాహన యోగాలు.రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు.


రాశి-ధనస్సు


ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు. శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు చిక్కులు తప్పవు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే.


రాశి-మకరం


నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆలోచనలు అమలు చేస్తారు. వ్యవహారాల్లో విజయం. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.


రాశి-కుంభం


ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. అందరిలోనూ గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు. మాటల చాతుర్యంతో అందరిని ఆకర్షిస్తారు. భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. వ్యాపార విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగవర్గాలవారికి నూతనోత్సాహం.


రాశి-మీనం


సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్యం, ఔషధ సేవనం. ఆలయ దర్శనాలు. రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు కోర్టు వివాదాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలు ముందుకు సాగవు.