ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:34 PM
 

ఏపీ సర్కార్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంది. మరో 426 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 పోస్టుల్ని, 3 ప్రభుత్వ నర్సింగ్ స్కూల్స్‌లో 144 పోస్టుల్ని భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషన్, రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, శ్రీకాకుళం రిమ్స్, మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రుల్లో గల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటితో పాటు ఒంగోలులోని రిమ్స్, తిరుపతిలోని ఎస్‌వీఆర్ఆర్ జీజీహెచ్, ఏలూరులోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలో గల ప్రభుత్వ నర్సింగ్ స్కూల్స్‌లో 144 పోస్టులు భర్తీ కానున్నాయి.