ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:31 PM
 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నందున జైళ్లలో ఖైదీలకు ఇబ్బంది కలగకుండా సర్కార్ 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక పై కొత్త నేరస్తులు,నిందితులను కోర్టు ఆదేశాల తర్వాత ముందుగా ప్రత్యేక జైళ్లకు తరలిస్తారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు చేసిన తర్వాత కరోనా లక్షణాలు లేవని తేలితే సాధారణ జైలుకు తరలిస్తారు. దీని ద్వారా ఇప్పటికే జైళ్లలో ఉన్న వారికి కరోనా రాకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.