ఇండియా కరోనా బులెటిన్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 08, 2020, 12:30 PM
 

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో 22,752 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 482 మంది మరణించగా 16,883 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 4,56,830 మంది డిశ్చార్జ్ కాగా 20,642 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,64,944 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ఇండియా అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది.