తల్లి కాలేకపోతున్నానని ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:21 PM
 

మూడేళ్లైనా పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ మానసికంగా కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడింది. విషం తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. టిఒఐ కథనం మేరకు.. జిల్లాలోని జన్నారం మండలం చింతగూడకి చెందిన సింధూజ(22)కి మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో వివాహమైంది. సంతానం కలగడం లేదని సింధూజ కొద్దికాలంగా బాధపడుతోంది. మూడేళ్లైనా పిల్లలు పుట్టలేదని మానసికంగా కుంగిపోయిన ఆమె అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాలు విడిచింది. యువతి ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.