ఇంట్లోనే నెలకు రూ.5 లక్షలు సంపాదించండిలా

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:18 PM
 

ఫుడ్ బిజినెస్ రంగంలో టొమాటో కెచప్ తయారీది ప్రత్యేక స్థానం. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి టొమాటో కెచప్ తయారీ యూనిట్ చక్కటి అవకాశం అనే చెప్పాలి. ముందుగా టొమాటో కెచప్ పరిశ్రమ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. టొమాటో కెచప్ ప్రస్తుతం బాగా పేరుపొందిన పరిశ్రమగా మారింది. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్ లో టొమాటో కెచప్ డిమాండ్ ఎక్కువ అయ్యింది. రోజువారి నిత్య అవసరాల్లో టొమాటో కెచప్ కూడా ఒక సాధనం అనే చెప్పాలి. టొమాటో కెచప్ పరిశ్రమ లో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. టొమాటో కెచప్ పరిశ్రమ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అయితే టొమాటో కెచప్ ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన యంత్రాలు ఏంటో తెలుసుకుందాం. టొమాటో కెచప్ పరిశ్రమకు మొత్తం ఏడు రకాల మిషిన్స్ కావాల్సి ఉంటుంది. 1. ఫ్రూట్ వాషింగ్ మిషిన్, 2.సార్టింగ్ మిషిన్, 3.క్రషింగ్ మిషిన్, 4.పల్పింగ్ మిషిన్, 5.కుకింగ్ మిషిన్, 6.హోమోజినైజర్, 7.బాటిల్ ఫిల్లర్, బాటిల్ వాషింగ్ మెషిన్, బాటిల్ కాప్ మిషిన్ అవసరం అవుతాయి.రా మెటీరియల్ విషయానికి వస్తే ఫ్రెష్ టొమాటోల అవసరం మనకు ఉంటుంది. చిల్లీ సాస్ తయారీకి పచ్చిమిరప, పండు మిరప అవసరం అవుతాయి. అలాగే ఫుడ్ కలర్స్, సాల్ట్, మసాలా దినుసులు, నీళ్లు అవసరం అవుతాయి. ఫ్రూట్ వాషింగ్ మిషిన్ ద్వారా టొమాటోలను శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. ఈ మిషిన్ ధర మీ యూనిట్ సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాలి. దీని ధర రూ.2 లక్షల దాకా ఉంటుంది. అలాగే సార్టింగ్ మిషిన్, క్రషింగ్ మిషిన్, పల్పింగ్ మిషిన్, కుకింగ్ మిషిన్, హోమోజినైజర్, బాటిల్ ఫిల్లర్, బాటిల్ కాప్ మిషిన్ ఇలా మొత్తం ఒక సప్లై చెయిన్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఈ బిజినెస్ మొదలు పెట్టేందుకు 1000 గజాల స్థలం అవసరం అవుతుంది. అందులో మంచి షెడ్ వేసుకోవాలి. ఇక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెమీ ఆటోమేటిక్ (అంటే చిన్నతరహా ప్లాంట్) అయితే రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.20 నుంచి రూ. 25 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. ప్రొడక్షన్ ఖర్చు విషయానికి వస్తే..మార్కెట్లో టమాటా ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇక యూనిట్ స్థాపించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ తో పాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది.ఒక కేజీ టమోటో సాస్ తయారీకి మనకు రూ. 75 ఖర్చు(ముడి సరుకు, లేబర్ చార్జీలు, కరెంట్, ట్రాన్స్ పోర్ట్) అవుతుంది. హోల్ సేల్ ధరలో మార్కెట్లో మనం రూ.85 వరకూ అమ్మవచ్చు. గంటకు 100 కేజీల టొమాటో కెచప్ తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే...అంటే గంటకు రూ.1000 లాభం పొందే వీలుండగా, రోజుకు 8 గంటల పాటు యూనిట్ నిడిపినప్పటికీ, రూ.8000 ఆదాయం వస్తుంది. 5 లీటర్లు, 10 లీటర్ల క్యాన్స్ ద్వారా సరఫరా చేసేలా, ఫుడ్ కేటరింగ్ సర్వీసులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చైనీస్ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంటే, ఆర్డర్లు నిరంతంరం వచ్చే చాన్స్ ఉంది. అలాగే రిటైల్ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా కెచప్ అమ్మినట్లయితే మరింత ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన నెలకు రూ. 2 నుంచి రూ.5 లక్షల ఆదాయం పొందే వీలుంది. వ్యవసాయదారుల నుంచి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసినట్లయితే మార్కెట్ ధర కన్నా తక్కువ మొత్తంలో వస్తాయి. అలాగే ఖర్చులు కూడా మిగిలే అవకాశం ఉంది.