ఏపీ కరోనా బులెటిన్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:16 PM
 

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో ఏపీలో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 9745 మంది డిశ్చార్జ్ కాగా 252 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,200 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు ఒక్క రోజే 13 మంది కరోనాతో మరణించారు. కర్నూలులో 4,అనంతపూర్ 3,చిత్తూరు 2,విశాఖపట్నం 2,ప్రకాశం,పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 2481,చిత్తూరు 1510,తూర్పు గోదావరి 1890,గుంటూరు 2262,కడప 1369,కృష్ణా 1898,కర్నూలు 2671,నెల్లూరు 810,ప్రకాశం 767,శ్రీకాకుళం 329,విశాఖపట్నం 945,విజయనగరం 269,పశ్చిమగోదావరి 1319 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 2257 మందికి కరోనా సోకగా 420 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ గా తేలింది.