మెరుపు వేగంతో కారు నడిపిన వ్యక్తి..పోలీసులు షాక్!

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 07, 2020, 07:14 PM
 

ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి హైవేపై అతి వేగంగా కారు నడిపాడు. పోలీసులు స్పీడ్‌గన్‌లో చెక్ చెయ్యగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలిసింది. చెక్ పోస్ట్ దగ్గర ఆ వెహికిల్ కోసం బ్యారికేడ్లు అడ్డం పెట్టారు. దాంతో డ్రైవర్ కారు ఆపక తప్పలేదు. ఆ హైవేపై గంటకు 45 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. కానీ అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్లావని పోలీసులు ప్రశ్నించారు. అందుకు ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపోయారు. తనకు టాయిలెట్ అర్జెంటుగా వస్తోందని, అందుకే అంత త్వరగా వెళ్తున్నానని సమాధానం చెప్పాడు. పోలీసులు అతని మాటలు నమ్మలేదు. అతన్ని కటకటాల పాలు చేశారు. విచారణలో అతను చెప్పింది తప్పని తేలింది. అంత వేగంగా వెళ్లిన డ్రైవర్ కు తగిన శిక్ష విధించారు.