ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? నిపుణులు ఏమంటున్నారు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 07:44 PM

శరీరం నుండి విషపదార్ధాలను తొలగించడానికి ఉపవాసం అనుసరించడం మంచిదేనా? శరీర జీవక్రియలను ప్రోత్సహించడానికి ఉపవాసం సాయపడుతుందా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..పురాతనకాలం నుండి పండుగలు, పర్వదినాలకి ఉపవాసాలు ఉండడం సాంప్రదాయం. క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఉపవాసం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు సైన్స్ కూడా చెబుతోంది.ఉపవాసం చేస్తే అధిక బరువు తగ్గడమే కాకుండా, జీవక్రియ సజావుగా సాగేందుకు దోహదపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాలేయం, మూత్రపిండాలు రెండూ మన శరీరం నుండి విషవ్యర్థాలను నిరంతరం తొలగిస్తాయి. కానీ పోషకాలతో కూడిన మంచి ఆహారాన్ని ప్రణాళికా బద్దంగా తీసుకోవడం తప్పనిసరి. నిరంతరం పనిచేసే జీర్ణ వ్యవస్థకు కొంత ఊరటగా ఈ ఉపవాసం ఉంటుందని కూడా కొందరు న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com