ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాండీ మేకింగ్ బిజినెస్... స్వయం ఉపాధికి చక్కటి మార్గం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 07:41 PM

పిల్లల ఈటింగ్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన గుడ్ ఐటెమ్స్ కు మార్కెట్ లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. చిన్న చాక్లెట్ నుండి పెద్దపెద్ద క్యాండీల వరకు ప్రతీదీ సూపర్ ఐటెమే. కాబట్టి ఈ పిల్లల ఈటింగ్ ఐటెమ్స్ బిజినెస్ ఏదైనా ఎంతో లాభదాయకం. లోకల్ యాప్ ఈ రోజు అలాంటి ఒక స్వయం ఉపాధి గురించే చెప్పబోతుంది. అదే క్యాండీ మేకింగ్ బిజినెస్. క్యాండీ అనగానే పిల్లలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. కాబట్టి నిత్యం వీటి అమ్మకం మార్కెట్ లో జోరుగా ఉంటుంది. కాబట్టి ఈ క్యాండీ మేకింగ్ బిజినెస్ గురించిన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.క్యాండీస్ తయారీ కొరకు మనకి పలురకాల రా మెటీరియల్ కావాలి. అవి షుగర్ సిరప్, ఫుడ్ కలర్, ఫుల్ ఫ్లేవర్, సిట్రిక్ యాసిడ్, షుగర్ ఇవన్నీ కలిపి ఒక క్యాండీ అచ్చును తయారు చేయాలి. పూర్తి క్యాండీ అచ్చు తయారీ కొరకు మనం ఇప్పటికే ఇవి తయారు చేసే వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇక క్యాండీస్ తయారీకి వివిధ రకాల అచ్చులు గల క్యాండీ మేకింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. దీని ధర 50 వేల వరకు ఉంటుంది. మనం ఈ మిషన్ ను ఇండియా మార్ట్ వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా క్యాండీ ప్యాకింగ్ కొరకు చిన్న చిన్న కవర్స్ కావాల్సి ఉంటుంది. వీటి ధర అదనం.ఒక కేజీ క్యాండీస్ తయారీపై మనకు 100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మనం ఒక కేజీ క్యాండీ ప్యాకెట్ పై 25 రూపాయలు లాభం వేసుకుని 125 రూపాయలకే మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు. రోజుకు కనీసం 40 కేజీల క్యాండీలు అమ్ముడుపోయినా మనకు వెయ్యి రూపాయల వరకు లాభం మిగులుతుంది. ఇలా నెలకు 30 వేల రూపాయలను సంపాదించడానికి అవకాశం ఉంటుంది.మనం క్యాండీలని మంచి రుచిగా అందించడమే ఈ బిజినెస్ లో ప్రధానమైన విషయం. మనకి ఈ బిజినెస్ కి అత్యంత ముఖ్యమైనది మార్కెటింగ్. మన పట్టణంతో పాటు ఇతర పట్టణాల్లో ఉన్న చిల్లర దుకాణాలకు, జనరల్ స్టార్స్, సూపర్ మార్కెట్స్ కు సప్లై చేయాలి. ఆరంభంలో తక్కువ ధరలకే వీటిని అందించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com