ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు..ఆదాయం అదుర్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 10:17 AM

ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యాపారానికి మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం. అంతే కాకుండా మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఎంతో వీలుగా ఉంటుంది. మనం మన ఇంట్లోనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఉన్న బిజినెస్ కాంపిటీషన్లో మనమే ఒక బ్రాండ్ పేరుతో నాలుగైదు వస్తువులను అందించడం ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు. అలాంటి ఒక వ్యాపారమే ప్రొడక్ట్ ప్యాకింగ్ అండ్ సేల్ బిజినెస్. ఈ బిజినెస్ లో మనం కారం, ఉప్పు, మసాలా, పసుపు, న్యూడిల్స్ ఇలా అనేక రకాలైన ప్రొడక్ట్స్ ను ఇంపోర్ట్ చేసుకుని ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవడమే. ఈ బిజినెస్ లో మనం కేవలం ప్యాకింగ్ చేసి సేల్ చేస్తాం అంతే. ఒకవేళ ఆసక్తి ఉంటే మనమే స్వయంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ ను తయారుచేసి ప్యాకింగ్ చేయవచ్చు. అయితే రిస్క్ తక్కువగా ఉండాలంటే మనం ప్రొడక్ట్స్ ను ఇంపోర్ట్ చేసుకోవడం మంచిది. ఇక ఈ బిజినెస్ కి ఏమేమి కావాలి, ఎలా ప్రారంభించాలో ఒకసారి చూద్దాం.ఈ బిజినెస్ ప్రారంభించడానికి మనకి ఒక ప్యాకేజింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది. దీని ధర మనకు రెండు లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. ఇది మనకు ఇండియామార్ట్ వెబ్ సైట్లలో లభిస్తుంది. ఆసక్తిగల వారు ఆ వెబ్ సైట్ ను సంప్రదించి మిషన్ ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మనం కావాలనుకున్న ప్రొడక్ట్స్ ను క్వింటాల్ లెక్కన హోల్ సేల్ గా కొనుగోలు చేయాలి. ఇక వీటితో పాటు మన బ్రాండ్ పేరుతో ఉన్న ప్యాకేజింగ్ కవర్స్ కావాల్సి ఉంటుంది. వీటికి మొత్తం ఆరంభ పెట్టుబడి కింద ఒక మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఈ బిజినెస్ లో రాబడి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. మనం మార్కెటింగ్ చేసే దాన్ని బట్టి లక్షల్లో ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే మన లాభం అనేది మన మార్కెటింగ్, మనం అందించే ప్రొడక్ట్స్, మనం సేల్ చేసే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ బిజినెస్ కు మార్కెటింగ్ అనేది అత్యంత కీలకం. మన ప్రొడక్ట్ ను మన పట్టణంతో పాటు ఇతర పట్టణాల్లో ఉండే డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు వారికి సేల్ చేసుకోవాలి. ఇప్పటికే మీరు అందించే ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉంటాయి కాబట్టి వాటి కంటే తక్కువ ధరకే అందిస్తామని ఒప్పందం చేసుకోవాలి. ఇలా మార్కెటింగ్ చేయడం ద్వారా తప్పకుండా బిజినెస్ లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com