ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఆర్థిక సాయం అందించాలి: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 04:05 PM

వైసీపీ ప్రభుత్వం ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో డిమాండ్ ఉంచారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఆర్థిక సాయం అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. స్వయం ఉపాధిలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలను ఆధారంగా చేసుకున్నవారు కరోనా మూలంగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు. వివాహాది శుభకార్యాలు ఉన్న మంచి రోజులన్నీ లాక్డౌన్‌లోనే పోయాయన్నారు. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకొనే సమయంలో స్టూడియోలను మూసివేయాల్సి వచ్చిందని పవన్ పేర్కొన్నారు. ఈ పరిణామంతో తామంతా ఆదాయం లేక అప్పు దొరికే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ రంగంలో ఉన్నవారికి ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించడంతో పాటు స్వయం ఉపాధి కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com