కృష్ణా జిల్లాలో కరోనాతో ముగ్గురి మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 30, 2020, 05:23 PM
 

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా కృష్ణా జిల్లాలో 84 కరోనా కేసులు నమోదు అవ్వగా..ముగ్గురు మరణించారు.