వార్షిక ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 03, 2020, 05:20 PM
 

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. అదే రూ.365 ప్లాన్. ప్రస్తుతానికి కొన్ని టెలికాం సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీంతో రోజుకు 250 నిమిషాల టాక్ టైం, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అయితే ఈ లాభాలు కేవలం 60 రోజుల పాటు మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా పైన తెలిపిన లాభాలతో పాటు పీఆర్ బీటీ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ 60 రోజులు అయిపోయాక వినియోగదారులు వాయిస్, డేటా కావాలనుకుంటే వాటికి సంబంధించిన వోచర్లను యాడ్ చేసుకోవచ్చు.