టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్​

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 03, 2020, 05:18 PM
 

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పదో తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.