జన్ ధన్ ఖాతాలోకి డబ్బులు

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 03, 2020, 02:17 PM
 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వేర్వేరు వర్గాలకు వేర్వేరుగా ఆర్థిక చేయూతను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే మొత్తం రూ.1,500 ట్రాన్స్‌ఫర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. మూడో విడత డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. జూన్ 5- అకౌంట్ నెంబర్‌ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి, జూన్ 6- అకౌంట్ నెంబర్‌ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి, జూన్ 8- అకౌంట్ నెంబర్‌ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి, జూన్ 9- అకౌంట్ నెంబర్‌ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి, జూన్ 10- అకౌంట్ నెంబర్‌ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి డబ్బులు ఇవ్వనున్నారు. జూన్ 5న నగదు బదిలీ ప్రారంభమై జూన్ 10న ముగుస్తుంది.