ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం ఏం చేయాలి..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 28, 2020, 04:40 PM

ఈ రోజు కరోనా వైరస్ నుండి మనల్ని కాపాడే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో సమర్ధవంతంగా తోడ్పడే కాకరకాయలు గురించి తెలుసుకుందాం.

కాకర చేదు కాదు...తీయని నేస్తం

కాకర చేదుగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు కలిగిన ఆక్సీకరణలు, ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటుంది.

కాకరకాయని జ్యూస్ లాంటి పానీయంలో, పచ్చళ్ళలో లేదా కొన్ని వంటలు వంటి వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు.

పోషకాల మయం కాకర
కాకరలోని పోషకాహార విలువలు:
కాకరలో A,B,C వంటి విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్, కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి.

కాకరకాయ వల్ల కలిగే అత్యంత ఆరోగ్యకర ప్రయోజనాలు...
రోగనిరోధక పద్ధతి:
*కాకరకాయ చెట్టు ఆకులు లేదా పండ్లను నీటిలో ఉడికి౦చి ఆ కషాయాన్ని రోజూ తీసుకుంటే అంటురోగాలు రానీకుండా చేస్తుంది.
*ఇది మీ రోగనిరోధక శక్తి పెంపొందడానికి కూడా సహాయపడుతుంది.

శ్వాస రుగ్మతలు మాయం
*తాజా కాకర కాయలు ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతమైన చికిత్సగా పనిచేస్తాయి.

లివర్ టానిక్:
*రోజూ ఒక గ్లాసు కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు నయమవుతాయి. ఇలా వారంరోజులు చేసినట్లైతే చక్కని ఫలితం కనిపిస్తుంది.

మధుమేహగ్రస్తుల పాలిట వరం
*కాకర రసం 2 వ రకం మధుమేహవ్యాధిని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పవచ్చు.
*కాకర బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలను కలిగి ఉంటుంది.

మలబద్ధకం మాయం
*కాకరకాయల్లో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల ఇది తేలికగా అరుగుతుంది.
*ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది.

మూత్రపిండాలు, మూత్రాశయం ఆరోగ్యానికి కాకర
*కాకర కాయ కాలేయం, మూత్రాశయం ఆరోగ్యంగా ఉచుకోవడానికి సహాయపడుతుంది.
*అలాగే ఇది మూత్రపిండాలలో రాళ్ళు నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది.

గుండె జబ్బులు దూరం:
*కాకర కాయలు అనేక మార్గాలలో గుండెకు చాలా మంచిది.
*ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
*అలాగే బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా గుండెను ఆరోగ్య౦గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

కాన్సర్ నివారిణి:
*కాకర కాయలు కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది.

అధిక బరువు మాయం
*కాకర కాయ జీర్ణ వ్యవస్థ తాజాగా ఉండడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగిఉంది.
*ఇది మీ జీవక్రియను, అరుగుదల విధానాన్ని అభివృద్ది చేసి తద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నులిపురుగులు మాయం
*చిన్న పిల్లలకు కూడా వారానికి ఒకసారైనా కాకరకాయ కూర తినిపించడం అలవాటు చేస్తే వారికీ కడుపులో వచ్చే నులిపురుగులు సమస్య దూరమవుతుంది.

ఇన్ని ప్రయోజనాలున్న కాకరకాయను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

రేపు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కావలసిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com