బ్యాంక్ అకౌంట్ తెరవాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు ఇంట్లో నుంచే బ్యాంక్ అకౌంట్ తెరిచే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అది కూడా కేవలం ఒక్క వీడియో కాల్‌తో బ్యాంక్ అకౌంట్ తెరిచేయవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ ) ఇప్పటికే వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్‌కు అనుమతి ఇచ్చింది. అంటే వీడియో కాల్‌తో బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్ వంటివి ఇప్పటికే ఈ తరహా సేవలను కస్టమర్లకు అందిస్తున్నాయి. గతంలో బ్యాంకులు ఆధార్ సహా ఓటీపీ ప్రక్రియ ద్వారా నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రాసెస్‌ను పూర్తి చేస్తున్నాయి. దీని ద్వారా బ్యాంక్ అకౌంట్‌ను తెరుస్తున్నాయి. అయితే సుప్రీం కోర్టు ఆధార్ వినియోగాన్ని నియంత్రించడంతో బ్యాంకులు ఇప్పుడు పాత పద్ధతిలోనే కేవైసీ పూర్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ బ్యాంకులకు వీడియో ఐడెంటిఫికేషన్ ప్రక్రియకు అనుమతినిచ్చింది.
వీడియో కేవైసీ ద్వారా డాక్యుమెంట్ల వెరిఫికేషన్, కస్టమర్ సిగ్నేచర్ వంటివి వీడియో కాల్ ద్వారానే ధ్రువీకరిస్తారు. వీడియో కేవైసీ పూర్తయిన తర్వాత కస్టమర్‌కు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. బ్యాంక్ ఖాతాపై ఎలాంటి నిబంధనలు ఉండవు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌పై కూడా లిమిట్స్ ఉండవు. ‘కోవిడ్ 19 వల్ల తీవ్ర గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటప్పుడు వీడియో కేవైసీ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.