ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో ఉన్నా కూడా మాస్కును ధరించాలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 24, 2020, 09:48 AM

నా పేరు డా. మంగమూరి జగదీష్ ఫార్మ్ డి, పాల్స్, (డీఎన్ హెచ్ఈ) . పీడియాట్రిక్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. వేగంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా గురించి కామెంట్స్ లో వచ్చిన ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానాలు ఇస్తున్నాను. మీకు కూడా కరోనా వైరస్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. సమాధానాలు తెలుసుకోండి.

1.ఎన్ని రోజుల వరకూ మాస్కును ధరించవచ్చు?
జవాబు: మాస్కులు ఇన్ని రోజులు వరకూ ధరించాలని లేదు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కును ధరించాల్సిందే.

2.N95 మాస్క్ ఎన్ని రోజులు ధరించాలి..? 6 గంటలే అంటున్నారు నిజమేనా..?
జవాబు: సాధారణంగా రెస్పిరేటర్ మాస్కులు ఒక రోజు వరకూ వినియోగించవచ్చు. అందులో ఎన్95 అనేది లెవల్1 మాస్కు. ఎన్99 అనేది లెవల్2 మాస్కు. ఎన్100 అనేది లెవల్3 మాస్కు. వీటన్నింటినీ కూడా ఒక రోజు వరకూ మాత్రమే వినియోగించుకోవచ్చు.

3.ప్రభుత్వాలు ఇస్తున్న మాస్క్ ను ధరించొచ్చా? వాటికి మనం చేసుకునే మాస్క్ లకు తేడా ఏంటి..?
జవాబు: ప్రభుత్వం ఇస్తున్న మాస్కుకు, మనం చేసుకునే మాస్కుకు తేడా ఏం లేదు. ఏదైనా ధరించవచ్చు.

4.ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ను ధరించాలా?
జవాబు: ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు కానీ ఉన్నట్టైతే మాస్కును ధరించడం మంచిది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి చికిత్స పొందిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మాస్కును కుటుంబీకులందరూ ధరించాలి.

మీ సందేహాలను, ప్రశ్నలకు కామెంట్ ద్వారా తెలియజేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com