ఏపీలో 2561కి చేరిన కరోనా కేసులు

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 05:18 PM
 

ఏపీలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 47 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561కి చేరింది. ఇప్పటి వరకు 1778 మంది డిశ్చార్జ్ కాగా 56 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 727 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను వైద్యశాఖ వెల్లడించలేదు. కరోనాతో నేడు కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.