ఏపీ వాహనదారులకు శుభవార్త

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 05:16 PM
 

ఏపీలో కరోనా కాలంలో పట్టుబడ్డ వాహనదారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో కొంత మంది ఎటువంటి కారణం లేకుండానే రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘించారు. అలా ఏపీ వ్యాప్తంగా వేలాది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వాహనదారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. ఆ వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించి వాహనాలను తిరిగి పొందవచ్చని డీజీపీ తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.