వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

  Written by : Suryaa Desk Updated: Sat, May 23, 2020, 05:15 PM
 

వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఎవరి ఫోన్ నంబరైనా మన ఫోన్ లో సేవ్ చేసుకోవాలంటే వారి నంబర్ టైప్ చేసి యాడ్ కాంటాక్ట్ కొట్టి సేవ్ చేసుకుంటాం. ఒక్కోసారి పలు నంబర్లు తప్పు కూడా టైప్ అయ్యి సేవ్ అవుతుంటాయి. దాంతో వారి కాంటాక్ట్ మనం మిస్సయ్యే అవకాశం ఉంది. ఇక నుంచి అటువంటి పరిస్థితి లేకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. మనం సేవ్ చేసుకోవాలనుకున్న వారి వాట్సాప్ లోని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్ గా వారి నంబర్ మన ఫోన్ లో యాడ్ అవుతుంది. ప్రస్తుతం ఇది బీటా వర్షన్ లో అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని ఫోన్లలో ఇది అందుబాటులోకి రానుంది. వాట్సాప్ సెట్టింగ్స్ మెనూలో ఈ ఆప్షన్ తీసుకురానున్నారు.