లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్-NIRD & PR 32 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.కొన్ని పోస్టులు హైదరాబాద్లో ఉండగా మరికొన్ని న్యూ ఢిల్లీలో ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మే 23 చివరి తేదీ. వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు nirdpr.org.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేయవచ్చు. నోటిఫికేషన్ కూడా మీకు ఇదే వెబ్ సైట్ లో కనిపిస్తుంది.