కరోనా వేళ..ఏడుగురితో రెండు పెళ్లిలు...

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 03:50 PM
 

పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కరోనా వేళ పెళ్లిళ్లన్ని ఆగిపోయాయి. మళ్లీ ముహుర్తాలు లేకపోవడంతో కుదిరిన పెళ్లిలను నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారు. ఎటువంటి హడావుడి,హంగు ఆర్భాటాలు లేకుండా చేసుకుంటున్నారు. తాజాగా ఏడుగురు సభ్యులతో రెండు పెళ్లిళ్లు జరిగాయి. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గవరపాలెంకు చెందిన మహేష్ ఏప్రిల్ 9న వివాహం నిశ్చయమైంది. అదే విధంగా తాకాశి వీధిలో ఈశ్వరరావుకు కూడా ఏప్రిల్ 9నే వివాహం జరగాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వివాహం జరగని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వివాహాలు ఆగితే మళ్లీ ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవని పురోహితుడు చెప్పాడట. దీంతో పోలీసులు అనుమతితో పెళ్లికి ఏడుగురు మాత్రమే ఉండేట్లు చూసుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు పెళ్లిలు జరిగాయి. ఇందులో కూడా భౌతిక దూరం పాటించారు. కరోనా వేళ ఈ పెళ్లిలు ఆదర్శంగా నిలిచాయి.