బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..!

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 03:48 PM
 

బీఎస్ఎన్ఎల్ తన రూ.499 భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను మరిన్ని రోజులు అందుబాటులో ఉంచనుంది. మొదట ఈ ప్లాన్ తో మార్చి 31వ తేదీ వరకు మాత్రమే రీచార్జ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని జూన్ 29వ తేదీ వరకు పొడిగించింది. ప్రమోషనల్ పద్ధతిలో ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన రూ.499 భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు నెలకు 100 జీబీ డేటా అందిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ 20 ఎంబీపీఎస్ గా ఉండనుంది. ఈ డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కు పడిపోనుంది. దీంతోపాటు వినియోగదారులు తమ ల్యాండ్ లైన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ రూ.499 ప్రమోషనల్ ప్లాన్ అండమాన్, నికోబార్ తప్ప అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ లభించదు. బీఎస్ఎన్ఎల్ రూ.399 పైబడిన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను అందిస్తుంది. అయితే ఈ రూ.499 ప్లాన్ ద్వారా మాత్రం ఆ లాభాలు లభించవు.