రిలయన్స్ అందిస్తోన్న కరోనా పాలసీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 03:38 PM
 

నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ తాజాగా కోవిడ్ 19 ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ అని వస్తే చికిత్సకు బీమా మొత్తం ఒకే సారి పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడు క్వారంటైన్‌లో ఉంటే బీమా మొత్తంలో సగం చెల్లిస్తారు. రిలయన్స్ పాలసీ గడువు ఏడాది. ఈ పాలసీ వెయిటింగ్ పీరియడ్ 15 రోజులు. అంటే పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాత మీకు కరోనా వస్తే అప్పుడు బీమా మొత్తాన్ని పొందొచ్చు. కరోనా వైరస్ వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ పాలసీని రూపొందించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. 3 నెలల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వారు జీతం కోల్పోవడం, జాబ్ పోగొట్టుకోవడం వంటి వాటికి యాడ్ ఆన్ ఆప్షన్ కూడా ఉంది. బేస్ పాలసీకి ఇవి అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ ఎక్స్‌క్లూజన్ రిమూవల్ ఆప్షన్ కూడా ఉంది.