తెల్ల కార్డుదారులకు రెండు రోజుల్లో నగదు

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 03:22 PM
 

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో రోజువారీ కూలీలతో పాటు ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో 1500 రూపాయాలను నెలకు 500 చోప్పున మూడు విడతలుగా ఇవ్వనుంది. ఇందులో భాగంగా తొలివిడత 500 నగదును ఇప్పటికే ఆయా ఖాతాల్లో జమ చేసింది. దీంతో పాటు రైతుల ఖాతాలో 2000 రూపాయాలను కూడ కేంద్రం జమ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనిషికి ఒక్కరికి 12 కిలోల చోప్పున రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇక తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయాలపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో నేరుగా రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డుదారులందరి ఖాతాల్లో 1500 రూపాయాలను ప్రభుత్వం జమ చేయనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి 1500 రూపాయలను ఇస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.