రోజాకు షాక్… నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 02:30 PM
 

నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి నిన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి తమకు సాయం అందడం లేదని, నిధులు కూడా విడుదల చేయలేదని చెప్పారు. అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే రోజాపై ప్రశంసలు కురిపించారు. అయితే దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.