వైద్యులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 10, 2020, 01:47 PM
 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన జగన్ వైద్యులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి జగన్ స్వయంగా తెలుసుకున్నారు. వైద్య పరికరాలు, మాస్కుల కొరత వంటి సమస్యలు ఉన్నాయా? అని జగన్ వైద్యులను ప్రశ్నించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ కు తెలియజేయాని జగన్ వైద్యులకు సూచించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో పరిస్థితిని కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా విపత్తు సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని, సేవలను ప్రశంసించారు.