పీఎఫ్ అకౌంట్లో ఇప్పటివరకు ఎంత జమైందో ఈపీఎఫ్ పోర్టల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇటీవలే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచింది. మీ పీఎఫ్ అకౌంట్లో ఇప్పటివరకు ఎంత జమ చేశారో ఆన్లైన్లో ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్-యుఎఎన్ నంబర్ యాక్టివేట్ చేయడం తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోండి. ఈపీఎఫ్ఓ పోర్టల్ లో ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అవర్ సర్వీసెస్ ట్యాబ్‌లో ఫర్ ఎంప్లాయిస్ సెలెక్ట్ చేయాలి. సర్వీసెస్ ఆప్షన్లో మెంబర్ పాస్ బుక్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో యుఎఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎప్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇపిఎఫ్ఒహెచ్ఒ యుఎఎన్ ఇఎన్జీ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ వివరాలు తెలుగులో కావాలంటే ఇపిఎఫ్ఒహెచ్ఒ యుఎఎన్ టిఇఎల్ అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓకు సంబంధించిన వివరాలన్నీ చూడొచ్చు. మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ అకౌంట్‌తో రిజిస్టరై ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి.