ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలి కోసం.. క్వారంటైన్ నుంచి పరారైన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 12:17 PM

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్ డౌన్ ను పాటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రోజున తమిళనాడులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే.. మధురై ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చాడు. కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఆ యువకుడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.


అప్పటికే ఆ యువకుడు శివగంగకు చెందిన ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.అయితే, క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆ యువకుడు విరహం భరించలేకపోయాడు. ప్రియురాలిని చూసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయాడు.దాంతో వైద్య సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ప్రియురాలి ఇంట్లో ఉన్న అతడినిగుర్తించారు.అనంతరం అతడు కరోనా అనుమానితుడు కావడంతో, ఆ యువతిని కలిసిన నేపథ్యంలో ఆమెకు కూడా కరోనా సోకుతుందేమోనన్న అనుమానంతో ఇద్దరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.అంతేకాదు, క్వారంటైన్ నియమావళి ఉల్లంఘించాడంటూ ఈ యువకుడిపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com