ఎస్బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్..!

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 07:15 PM
 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు బ్యాంకు షాకిచ్చింది. లాకర్ ఛార్జీలను భారీగా పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకుల్లోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలను పెంచింది. అన్ని కేటగిరీల్లో రూ.500 నుంచి రూ.3000 వరకు లాకర్ ఛార్జీలను పెంచింది ఎస్‌బీఐ. ఇకపై లాకర్ కావాలంటే మెట్రో, అర్బన్‌లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్‌లో కనీసం రూ.1,500 చెల్లించాలి. ఒకవేళ పెద్ద లాకర్ కావాలంటే రూ.12,000 వరకు చెల్లించాల్సిందే. వన్‌ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.500+జీఎస్‌టీ వసూలు చేయనుంది. ఒకవేళ లాకర్ రెంట్ ఛార్జీలు గడువు లోగా చెల్లించకపోతే అదనంగా 40% పెనాల్టీ చెల్లించాలి. కొత్త ఛార్జీలు 2020 మార్చి 31 నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది.