విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆందోళనకారులు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. కాన్వాయ్ ముందు భైఠాయించి కార్యకర్తలు నిరసనలు తెలిపారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసిపి కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎయిర్ పోర్టు వద్ద టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. అచ్చెన్నాయుడిని ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.