ఏపీ ప్రభుత్వం మార్చి6న బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 2 లేదా 3 వ తేదిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి6న ఏకాదశి రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.