30ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్ర ఎర్రన్నాయుడి సొంతమని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడుకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం ఎర్రన్నాయుడిదేనన్నారు.